భగవద్గీత 4-7

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

పదచ్ఛేదం

యదాయదాహిధర్మస్యగ్లానిఃభవతిభారతఅభ్యుత్థానంఅధర్మస్యతదాఆత్మానంసృజామిఅహం

ప్రతిపదార్థం

భారత = భరత వంశీయుడైన అర్జునా ; యదా యదా = ఎప్పుడెప్పుడైతే ; ధర్మస్య = ధర్మానికి ; గ్లానిః = హాని ; అధర్మస్య = అధర్మానికి ; అభ్యుత్థానమ్ = వృద్ధి ; భవతి = అవుతుందో ; తదా హి = అప్పుడప్పుడంతా ; అహం = నేను ; ఆత్మానం = నన్ను ; సృజామి = సృష్టించుకుంటూ ఉంటాను

తాత్పర్యం

ఓ భరత వంశీయుడా, అర్జునా, ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. ”

వివరణ

ఏదేని ఒకానొకసాధారణ, సగటు ఆత్మతన స్వంత ప్రగతి కోసం

తన ఆత్మ పురోభివృద్ధి కోసంమాత్రమే

తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది.

అయితేఒకానొక సగటు ఆత్మఅనేకానేక జన్మల తన పరిణామక్రమంలో

తన స్వంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తరువాత

ఒకానొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు

ఇక తనను గురించి తాను తెలుసుకోవలసింది ఏమీ ఉండదు.

అప్పుడుఆ పరమాత్మ స్థితిలోలోకకళ్యాణం కోసం

అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది.

అటువంటి ఒకానొక పరమాత్మే శ్రీకృష్ణులవారు

ఆయన్ని ఆయనే సృష్టించుకున్నారు. 

ఎప్పుడు ? ” అంటే

అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు,

అందరూ సత్యం మరచిపోయినప్పుడు.

ఎందుకు ? ” అంటే

ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు,

తద్ద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు

వేదవ్యాసుడు, ఏసుప్రభువు, గౌతమబుద్ధుడు, వర్థమాన మహావీరుడు

ఇలా ఎందరో, ఎందరో పరమ ఆత్మలు

అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు.

పరమ ఆత్మఅంటేపరమ స్థితికి చేరుకున్న ఆత్మ ”.

తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన స్వంత ఆత్మ పురోభివృద్ధి కోసం

పూర్తిగా మన స్వంత ఇచ్ఛానుసారమే

మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము.

పుట్టేముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకుని పుడతాం.

ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకుని

ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకునిపుడతాం.

గుర్తుంచుకుందాం

ఇదేఆధ్యాత్మిక శాస్త్రంలోనిస్పిరిచ్యువల్ సైన్స్లోనిఅత్యంత ముఖ్య సూత్రం !

ఈ జీవితరంగం అనే నాటకరంగంలోకిఈ కర్మక్షేత్రంలోకి

ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు

ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ సృష్టించరు !

ఇదే మొట్టమొదటి సూత్రం

ఇదే మధ్యలోని సూత్రం

ఇదే ఆఖరి, చిట్టచివరి సూత్రం కూడానూ !