భగవద్గీత 18-78

“ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ || ”

పదచ్ఛేదం

యత్ర – యోగేశ్వరః – కృష్ణః – యత్ర – పార్థః – ధనుర్ధరః – తత్ర – శ్రీః – విజయో – భూతిః – ధ్రువానీతిః – మతిః – మమ

ప్రతిపదార్థం

యత్ర = ఎక్కడ ; యోగేశ్వరః = యోగేశ్వరుడైన ; కృష్ణః = శ్రీకృష్ణుడు ; యత్ర = ఎక్కడ ; ధనుర్ధరః = ధనస్సును చేబట్టిన ; పార్థః = అర్జునుడు ; తత్ర = అక్కడ ; శ్రీః = లక్ష్మి (సంపద) ; విజయః = విజయం ; భూతిః = ఐశ్వర్యం ; ధ్రువా = దృఢమైన ; నీతిః = నీతి ; (సన్తి ఇతి = కలవు అని ) ; మమ = నా యొక్క ; మతిః = అభిప్రాయం

తాత్పర్యం

“ ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా ఆభిప్రాయం. ”

వివరణ

శ్రీకృష్ణుడు ఒకానొక జగద్గురువు ; ఒకానొక యోగేశ్వరుడు …

శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట ;

శ్రీకృష్ణుడు ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక.

ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక పురోభివృద్ధి కోసం

తన సర్వ శక్తి సామర్థ్యాలను వినియోగించడానికీ … మరి

బాహ్య శత్రువులనే కాకుండా అంతః శత్రువులను కూడా నిర్జించడానికీ …

అనుక్షణం సిద్ధంగా వుండే ఒకానొక యోద్ధుడికీ …

ఒకానొక ముముక్షువుకీ ప్రతీక.

“ ఈ ఇద్దరూ ” అంటే …

సరియైన భౌతిక జీవన విధానంలో సరియైన ఆధ్యాత్మికతను మేళవించి,

మన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే …

సంపద, విజయం, ఐశ్వర్యం, పటిష్టమైన నీతి నియమాలు

ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లివిరుస్తాయి.

“ శ్రీ ” అంటే “ ఐశ్వర్యం ” “ ప్రాపంచిక సంపదలు ”

“ విజయం ” అంటే సరియైన వివరణ “  మోక్షం  ”, “  ఆత్మలబ్ధి ”.

“ ధ్రువానీతి ” అంటే “ దృఢమైన ధర్మం ”, “ చక్కగా అనుష్టింపబడిన ధర్మం ”

“ భూతి ” అంటే “ ఆనందం ” “ ఇహ, పర లోకాలలో ఆనందం ”

వీటిని సాధించడానికి ధ్యానాన్ని …

మన నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకుని …

ఆధ్యాత్మిక జీవనం సాగిద్దాం! ధ్యాన సాధనచేద్దాం!! ధ్యానయోగులమవుదాం!!!

ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు?

“క్షుద్రం హృదయ దౌర్భల్యం ”     … “ హృదయ దౌర్భల్యం తుచ్ఛమైనది”

“ గతాసూన్ అగతాసూంశ్చ     … “ చనిపోయిన వారిని గురించి కానీ,

  నాను శోచంతి పండితాః ”   జీవించి వున్న వారి గురించి కానీ

పండితులుశోకించరు ”

“ అహమాత్మా గుడాకేశ ”      … ‘ నేను ’ అనేది ‘ ఆత్మ ’ అని తెలుసుకో,

ఓ అర్జునా !

“ న హన్యతే హన్యమానే శరీరే ”      … “ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు ”

“ యోగో భవతి దుఃఖహా ”      … “ ధ్యానయోగాభ్యాసం వల్లనే దుఃఖం

హరిస్తుంది ”

“ సమత్వం యోగ ఉచ్యతే ”      … “ అన్ని పరిస్థితులలోనూ సమంగా

        వుండడమే యోగం అనిపించుకుంటుంది

“ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ”     … “ శ్రద్ధ కలిగినవాడికే జ్ఞానం లభిస్తుంది ”

“ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ”     … “ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు

దగ్ధమవుతాయి”

“ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ”      … “ బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం ”

“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు     … “ కర్మలుచెయ్యడానికేఅధికారం

  కదాచన ”   వుంది కానీ వాటి ఫలితాలపైన

ఎప్పటికీలేదు ”

“ కర్మ జ్యాయో హ్యకర్మణః ”     … “ కర్మలు తక్కువ చెయ్యడం కంటే

కర్మలుఎక్కువచెయ్యడమేమంచిది ”

“ యోగః కర్మసు కౌశలమ్ ”     … “ ధ్యానయోగం ద్వారానే కర్మల్లో

కౌశలంవస్తుంది”

“ యోగస్థః కురు కర్మాణి ”     … “ యోగస్థితిలో వుండే కర్మలను

చెయ్యాలి ”

“ తస్మాత్ యోగీ భవార్జున ”     … “ కనుక ధ్యానయోగివి కా, అర్జునా ! ”

“ నిస్త్రైగుణ్యో భవార్జున ”     … “ త్రిగుణాలకు అతీతుడవు కా, అర్జునా !”

“ ఉద్ధరేదాత్మనాత్మానం ”     … “ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ”

“ హతో వా ప్రాప్యసి స్వర్గం ”     … “ చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు”

“ యుద్ధస్య విగత జ్వరః ”     … “ ఎంతమాత్రం ఆవేశం లేకుండా యుద్ధం

   చెయ్యి”

“ యథేచ్చసి తథాకురు ”     … “ నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి ”