భగవద్గీత 6-26

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |       

తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ||

పదచ్ఛేదం

యతఃయతఃనిశ్చరతిమనఃచంచలంఅస్థిరంతతఃతతఃనియమ్యఏతత్ఆత్మనిఏవవశంనయేత్

ప్రతిపదార్థం

అస్థిరం = స్థిరంగా నిలువని ; చంచలం = చలించే ; ఏతత్, మనః = ఈ మనస్సు ; యతః, యతః = ఏయే శబ్దాది విషయాల కారణంగా ; నిశ్చరతి = (విశృంఖలంగా) సంచరిస్తుందో ; తతః, తతః = ఆ యా విషయాల నుంచి ; నియమ్య = మరల్చి ; ఆత్మని, ఏవ = ఆత్మలోనే ; వశం, నయేత్ = స్థిరపరచాలి.

తాత్పర్యం

చంచల స్వభావం కలిగివుండి, ఎంతమాత్రమూ నిలకడ లేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తూంటే అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి. ”

వివరణ

మనస్సుఅనేది ఆలోచనల పుట్ట

చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం !

అది ఎంతసేపూ ఇంద్రియ విషయ సుఖాల మీదకీగత స్మృతులలోకీ

ఎక్కడెక్కడికోపరుగులు తీస్తూనే ఉంటుంది.

అటువంటి దానిని ఆత్మలో స్థితమయ్యేటట్టు చెయ్యాలంటే

ఉన్న గొప్ప ఉపాయంశ్వాస మీద ధ్యాస ”.

మనలో జరుగుతూన్న శ్వాసను గమనిస్తూగమనిస్తూగమనిస్తూ ఉండాలి.

కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూఉండాలి.

అయితే మనస్సు శ్వాసను గమనించడం మానేసి,

దాని సహజ అలవాటు ప్రకారం ఎక్కడికో

ఏదో ఆలోచనకువెళ్ళిపోతూనే వుంటుంది.

వెంటనే దాన్ని అక్కడి నుంచి వెనుకకు తీసుకువచ్చి

మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనింప చేయాలి.

మనస్సు ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి పోతున్నా

అన్నిసార్లూ అక్కడక్కడ నుంచి తీసుకువచ్చి

శ్వాసనే గమనించేటట్టు చెయ్యాలి ! …

ఆ విధంగా చేస్తూనే ఉండాలి !

ఇదే మనం చేయవలసిన సాధన

ధ్యాన సాధన ” … “ యోగసాధన ” … “ధ్యాన యోగసాధన ”.

ఫలితంగా మనలోని అనవసర ప్రాపంచిక,

సంసారిక భావప్రవాహం ఆగిపోయి

ఆలోచనారహితస్థితి కలుగుతుంది.

అంటేమనస్సు నశిస్తుందన్నమాట !

మనస్సు నశించినప్పుడుఆత్మపదార్థం అన్నది అనుభూతికి వస్తుంది.