భగవద్గీత 7-3

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ||

 

పదచ్ఛేదం

మనుష్యాణాంసహస్రేషుకశ్చిత్యతతిసిద్ధయేయతతాంఅపిసిద్ధానాంకశ్చిత్మాంవేత్తితత్వతః

ప్రతిపదార్థం

మనుష్యాణాం, సహస్రేషు = వేలాదిమంది మనుష్యులలో ; కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే ; సిద్ధయే = ఆత్మానుభవత్ప్రాప్తికై ; యతతి = ప్రయత్నిస్తాడు ; యతతామ్ సిద్ధానామ్, అపి = ఆ విధంగా ప్రయత్నించిన యోగులలో కూడా ; కశ్చిత్ = ఒకానొకడు మాత్రమే ; “ మామ్ ” = “ తనను తాను ” ; తత్వతః = యథార్థంగా ; వేత్తి = తెలుసుకుంటాడు

తాత్పర్యం

వేలాదిమందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మమోక్షానికి ప్రయత్నిస్తున్నాడు ; అటువంటి వేలాదిమంది యతులలో యే ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. ”

వివరణ

కోట్ల కొద్దీ ఉన్న మనుష్యులలో కొంతమంది మాత్రమే

 నాకు సత్యం కావాలి ” … “ నాకు సిద్ధి కావాలి ” … అని ప్రయత్నిస్తారు.

మిగతావాళ్ళకుసత్యంఅవసరం లేదు … “ సిద్ధిఅక్కరలేదు.

మానవుల మానసిక పరిణతి, గుణగణాలు, వారి ఆత్మస్థాయికి అనుగుణంగా

వివిధ స్థాయిలలో వుంటుంది.

జన్మపరంపర ప్రారంభంలోభూలోకయాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ

శిశువుతో సమానమైనశైశవాత్మస్థితిలో వుంటుంది.

బాల్యఆత్మ స్థాయి నుండియవ్వనాత్మస్థాయికి …“ ప్రౌఢ ఆత్మస్థాయికీ

ప్రతి స్థాయిలోనూ కొన్ని కొన్ని జన్మలు తీసుకుంటూ

జీవించే విధానాన్ని నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ

పరిణతి చెందినవృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది.

అప్పుడే త్రికరణశుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది.

తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడావేలాదిమందిలో కొంతమంది

మాత్రం తమకు తాము నిజతత్వం తెలుసుకుంటారు.

ఏమిటి ఆ నిజతత్వం?? … “ నేను సర్వకాల సర్వపరిస్థితులలోనూ సర్వత్రా

వ్యాపించి ఉన్న ఆత్మను ! … ఆదిలోనూమధ్యలోనూఅంతంలోనూ కూడా నేనున్నాను ” … ఇదే ఆత్మ యొక్క నిజతత్వం.