భగవద్గీత 5-10

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |

లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ||

పదచ్ఛేదం

బ్రహ్మణిఆధాయకర్మాణిసంగంత్యక్త్వాకరోతియఃలిప్యతేసఃపాపేనపద్మపత్రంఇవఅంభసా

ప్రతిపదార్థం

యః = ఎవడైతే ; కర్మాణి = కర్మలనన్నింటిని ; బ్రహ్మణి, ఆధాయ = భగవదర్పణంచేసి ; సంగం, త్యక్త్వా = ఆసక్తిని త్యజించి ; కరోతి = (కర్మలను) ఆచరిస్తున్నాడో ; సః = ఆ పురుషుడు ; అంభసా = నీటిచేత ; పద్మపత్రం, ఇవ = తామరాకులాగా ; పాపేన = పాపాలచే ; , లిప్యతే = తాకబడడు

తాత్పర్యం

ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి, ఆసక్తిని విడిచి ఆచరిస్తారో, అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువులలాగా పాపం అంటుకోదు. ”

వివరణ

కర్మఫలం మీద ఆసక్తిని గానికోరికను గానిలేకుండా,

నేనుఅనే కర్తృత్వ భావన ఎంతమాత్రం లేకుండా,

కర్మలు చేస్తూ ఉంటేకర్మతో బంధం ఏర్పడదు.

కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మఫలితాలు అయిన

పాప, పుణ్యాలు ఏవీ మనల్ని అంటుకోవు.

నీటిలోనే పుట్టి, నీటిలోనే పెరిగి, నీటిలోనే నశించి పోయే తామరాకును

ఆ నీరు ఎంతమాత్రం తడుపలేనట్టే

ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే నివశిస్తూ కూడా

జ్ఞాని అయినవాడు తాను ఆచరించేనిష్కామ కర్మాచరణ

విధానం ద్వారా

పాపపుణ్యాలుమొదలైన ద్వంద్వాలనుండి విముక్తుడై

బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు.

తామరాకు మీద నీటిబొట్టులాగాజీవించే మానవ జీవితమే ఆధ్యాత్మిక జీవితం.