భగవద్గీత 2-50

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ || ”

 

పదచ్ఛేదం

బుద్ధియుక్తఃజహాతిఇహఉభేసుకృతదుష్కృతేతస్మాత్యోగాయయుజ్యస్వయోగఃకర్మసుకౌశలం

ప్రతిపదార్థం

బుద్ధియుక్తః = సమత్వబుద్ధి గలవాడు ; సుకృతదుష్కృతే = పుణ్యపాపాలను ; ఉభే = రెండింటినీ ; ఇహ = లోకంలోనే ; జహాతి = త్యజిస్తాడు(వాటి నుండి విముక్తుడౌతాడు) ; తస్మాత్ = అందువలన ; యోగాయ = సమత్వబుద్ధి కోసం ; యుజ్యస్వ = ప్రయత్నించు; యోగః = సమత్వరూప యోగమే ; కర్మసు = కర్మలలో ; కౌశలం = నేర్పు (కర్మబంధాల నుండి విడిపిస్తుంది)

తాత్పర్యం

సమబుద్ధి గలవాడు తన పాపపుణ్యాలను జన్మలోనే నశింప చేసుకుంటాడు; కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు ; యోగమే కర్మలలోని కౌశలం ”.

వివరణ

మానవుడు నిత్య కర్మిష్టికర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా కుదరదు

మంచిదో, చెడ్డదో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు.

సృష్టి ధర్మం ప్రకారం పుణ్యపాపాలు, కర్మబంధాలు తగులుకుంటాయి.

తత్ఫలితంగా జన్మపరంపరలో చిక్కుకుని విలవిల్లాడుతూ ఉంటాం

కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాలలో చిక్కుకోమో

పుణ్యపాపాల నుండి విముక్తులం అవుతామో

జన్మపరంపరలో నుండి బయటపడతామో

కిటుకు, కౌశలం, విధానం తెలియజేస్తున్నారు శ్రీకృష్ణపరమాత్మ.

అదేసమస్థితిలోయోగస్థితిలో ఉండి కర్మలు ఆచరించడం.

 “ సమత్వం యోగ ఉచ్యతే ”…

సమత్వమే యోగమని చెప్పబడుతున్నదిఅని ముందు శ్లోకంలో చెప్పారు.

ఇక్కడయోగః కర్మసు కౌశలమ్ ” …

యోగమే కర్మలలో కౌశలంఅంటున్నారు

సమత్వంలో ఉంటూయోగస్థితిలో ఉంటూకర్మలు చెయ్యడం అంటే … 

కర్మఫలాల మీద ఆసక్తి గానీ, కోరిక గానీ లేకుండా కర్మలు చెయ్యడం.

ఇంకా కార్యం యొక్క సిద్ధి, అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండడం.

కర్మఫలాల మీద ఆసక్తిని విడవడమంటే

కర్మఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడం.

సిద్ధి, అసిద్ధుల యందు సమభావంఅంటే

కర్మలు సిద్ధించినా, సిద్ధించకపోయినా కొంచెంగా సిద్ధించినా

కర్మఫలాలు ఏమైనా గానీ మనస్సులో సమత్వంతో ఉండడం.

అప్పుడు, ఆకర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు.

కనుక జన్మపరంపర నుండి బయట పడగలం. కనుక కర్మఫల ఆసక్తిని వదిలి

కార్యసిద్ధి కలిగినా, కలుగకున్నా సమస్థితిలో ఉంటూకర్మలను ఆచరిస్తే

లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు.

ఎన్ని కర్మలను చేస్తూ ఉన్నా కర్మల పర్యవసానాలకూ అంటని

రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలిఅదే కర్మల్లో కౌశలం !