భగవద్గీత 8-10

ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ||

 

పదచ్ఛేదం

ప్రయాణకాలేమనసాఅచలేనభక్త్యాయుక్తఃయోగబలేనఏవభ్రువోఃమధ్యేప్రాణంఆవేశ్యసమ్యక్సఃతంపరంపురుషంఉపైతిదివ్యం

ప్రతిపదార్థం

సః = అటువంటి ; భక్త్యా, యుక్తః = భక్తి గలవాడు ; ప్రయాణకాలే = అంత్యకాలంలో ; యోగబలేన = యోగబలంతోటి ; భ్రువోః, మధ్యే = భ్రూమధ్య ప్రదేశంలో ; ప్రాణం = ప్రాణాన్ని ; సమ్యక్ = చక్కగా ; ఆవేశ్య = నిలిపి ; = మరి ; అచలేన = నిశ్చలమైన ; మనసా = మనస్సుతో ; తమ్ = ; దివ్యం = దివ్యమైన ; పరం, పురుషం, ఏవ = పరమాత్మనే ; ఉపైతి = పొందుతాడు

తాత్పర్యం

అంత్యకాలంలో ఎవరు చలించని మనస్సుతో, యోగబలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు. ”

వివరణ

ఇంద్రియాలకు రాజు మనస్సు.

ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణ చేసి మనస్సుకు అందజేస్తాయి.

మనస్సు ఆ విషయ లాలసతల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది.

సుఖంగా కూర్చుని, కళ్ళు మూసుకుని, ధ్యాసను అంతా శ్వాసపై లగ్నం చేస్తూంటే

ఇంద్రియ ద్వారాలు మూయబడి

మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది.

ఈ విధంగా నిరంతర ధ్యానసాధన చేసేవాడు

అవసానకాలంఅంటే  శరీరాన్ని త్యాగం చేసే సమయం

సమీపించినప్పుడు కూడాచలించని మనస్సుతో, యోగబలంతో

ప్రాణాలను భ్రూమధ్యంలో గానీసహస్రారంలో గానీ నిలిపి

ఆత్మధ్యానం చేస్తూ

దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమాత్మప్రాప్తినే పొందుతాడు.