భగవద్గీత 4-8

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

 

పదచ్ఛేదం

పరిత్రాణాయసాధూనాంవినాశాయదుష్కృతాంధర్మసంస్థాపనార్థాయసంభవామియుగేయుగే

ప్రతిపదార్థం

సాధూనాం = సత్పురుషుల యొక్క ; పరిత్రాణాయ = రక్షణ కోసం ; దుష్కృతాం = దుష్టుల యొక్క ; వినాశాయ = నాశనం కోసం; = మరియు ; ధర్మసంస్థాపనార్థాయ = ధర్మాన్ని స్థాపించటానికి ; యుగే యుగే = ప్రతి యుగంలోనూ ; సంభవామి = (నేను) అవతరిస్తాను

తాత్పర్యం

సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసంప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను. ”

వివరణ

జయము – ‘ విజయము, ఖ్యాతి – ‘ విఖ్యాతి, నాశము — ‘ వినాశము

ఇలావిఅనేది విశేషమైన పదానికి సూచిక.

అలాగేపరిత్రాణాయలోపరిఅనేది, మరిసంస్థాపనార్థాయ ”,

సంభవామిఅన్న పదప్రయోగాలలోసంఅన్నవి చక్కటి ఉపసర్గలు

విశేషార్ధకంగా ఉపయోగింపబడే ఉపసర్గలు.

సాధువులు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు ;

సంరక్షింప బడుతూనే ఉంటారు ;

ఏకాలంలోనైనా కూడా సత్యం మారదు.

ఎప్పుడూ మంచి అన్నది సంరక్షింప బడుతూనే ఉంటుంది ;

చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది.

దుష్టవర్తనులకు ఎప్పుడూ ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది.

ఇది సత్యం ; ఇది కర్మ సిద్ధాంతం ; ఇది పురోగమన సిద్ధాంతం.

చెడు చెయ్యడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ ప్రత్యేకంగా అడ్డగించరు

చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది.

మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా ప్రోత్సహించరు

మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది.

మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశము జరుగుతాయి.

నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను

అని అర్జునుడు అన్నప్పుడు

శ్రీకృష్ణులవారన్నారునీవు ఎవ్వరినీ చంపజాలవు ;

శరీరం చనిపోతుంది కానీ ఆత్మచావదుఅని.

అదే సత్యం. అంతకంటే వేరొకటి లేదు.

సంభవామి యుగే యుగే ” …

ప్రతి ఆత్మ కూడానూ ఎప్పటికప్పుడు, మళ్ళీ మళ్ళీ

పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది.

ఆత్మకు పుట్టుక, చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన,

ఒక ప్రయోజనం వున్న, ఒక గొప్ప ఆట.

మనం శరీరాలం కాదుఆత్మలంఅని తెలుసుకోవడమే సత్యం.

అర్జునుడు శరీర తత్త్వానికి ప్రతీక … ‘ నరతత్త్వానికి ప్రతీక.

శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైనవారు ఆత్మతత్త్వానికి ప్రతీకలు

నారాయణ తత్త్వానికి ప్రతీకలు.

నరుడునారాయణుడుకావాలి.

నరుడునారాయణుడుగా ఎలా అవుతాడు? ” అంటే

ధ్యానం చేసిధ్యాన యోగం చేసిధ్యానాభ్యాసం చేసి.

Pyramid Spiritual Societies Movement అన్నది ప్రపంచంలో

క్రూరమానవులుగా వున్నవారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు,

దుష్కృతాలన్నీ అంతం చేసేందుకూ ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోద్యమం.

పిరమిడ్ మాస్టర్లు ఊరూరావాడ వాడలా తిరిగి

అందరికీ ధ్యానం నేర్పిస్తూ

ప్రతి నరుడూ ఒకనారాయణుడుకావాలని ప్రబోధిస్తున్నారు.