భగవద్గీత 4-38

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ||

 

పదచ్ఛేదం

హిజ్ఞానేనసదృశంపవిత్రంఇహవిద్యతేతత్స్వయంయోగసంసిద్ధఃకాలేనఆత్మనివిందతి

ప్రతిపదార్థం

ఇహ = ఈ జగత్తులో ; జ్ఞానేన, సదృశం = జ్ఞానంతో సమానంగా ; పవిత్రం = పవిత్రమైనది ; హి = నిస్సందేహంగా ; , విద్యతే = ఏదీ లేదు ; తత్ = ఆ జ్ఞానాన్ని ; కాలేన = దీర్ఘకాలం వరకు ; యోగసంసిద్ధః = యోగం ద్వారా సిద్ధిపొందినవాడు ; స్వయం = స్వయంగానే ; ఆత్మని = ఆత్మలో ; విందతి = పొందుతాడు.

తాత్పర్యం

జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు ; యోగసిద్ధిని పొందినవాడు ; కాలక్రమేణ ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. ”

వివరణ

అజ్ఞానం అంతరించి మన యొక్క యదార్థ స్వరూపాన్ని

స్వానుభవంతో గ్రహించే ఆత్మజ్ఞానమే సర్వశ్రేష్టమైనది.

ఇది వేరొకరు మనకు ఇచ్చేది కాదు.

మన యొక్క స్వప్రయత్నం వల్ల

మన సాధన వల్ల మాత్రమే మనకు సిద్ధిస్తుంది.

ఈ విషయంలో గురువులు సహాయకారులుగా మాత్రమే ఉపయోగపడతారు.

ఈ ఆత్మజ్ఞానం అంతఃకరణశుద్ధి కలిగి

సాధన పరిపక్వమైన స్థితిలోమనలో మనకేకలుగుతుంది.

ఇప్పటికి ఇప్పుడుఈ రోజు మొదలు పెడితే ఈ రోజే ప్రతిఫలం రాదు.

ఈ రోజు విత్తనం నాటితేఈ నాడే పండు మన చేతికి రాదు కదా !

విత్తనం మొలకెత్తాలిచెట్టుగా మారాలికాయ కాయాలి

పచ్చికాయ క్రమేపీ పండుగా పక్వం అవ్వాలి.

దీనికంతటికీ సమయం పడుతుంది.

అలాగే ధ్యానయోగ సాధన కూడా !

ఎంత శ్రద్ధతో, ఎంత దీక్షతో, ఎంత సాధన చేసినా

కొంత సమయం అన్నది తప్పక పడుతుంది మరి !

అందుకేసమయమే సాధనఅన్నాం.