భగవద్గీత 3-8

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |

శరీరయాత్రాపి తే ప్రసిద్ధ్యేదకర్మణః || ”

 

పదచ్ఛేదం

నియతంకురుకర్మత్వంకర్మజ్యాయఃహిఅకర్మణఃశరీరయాత్రాఅపితేప్రసిద్ధ్యేత్అకర్మణః

ప్రతిపదార్ధం

త్వం = నువ్వు ; నియతం = శాస్త్రవిహితమైన ; కర్మ = కర్తవ్యకర్మలను ; కురు = చెయ్యి ; హి = ఎంచేతంటే ; అకర్మణః = కర్మచేయకుండా వుండడం కన్నా ; కర్మ, జ్యాయః = కర్మ చేయడమే శ్రేష్ఠం ; = మరి ; అకర్మణః = కర్మచేయకపోతే ; శరీరయాత్ర = భౌతిక జీవనయాత్ర ; , ప్రసిద్ధ్యేత్ = సిద్ధించదు

తాత్పర్యం

నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు ; కర్మలు చేయకుండా వుండడం కన్నా, కర్మలు చేయడమే ఉత్తమం ; కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. ”

వివరణ

జీవితం సజావుగా జరగడానికిగాను చెయ్యవలసిన కర్మలను

నియమిత కర్మలు ”, “ విహిత కర్మలు ”, “ కర్తవ్య కర్మలుఅంటాం.

వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరికర్తవ్య కర్మలువారికి ఉంటాయి.

అవి ఆచరించడం వాళ్ళస్వధర్మంఅవుతుంది

కర్మలను చెయ్యక పోవడంఅకర్మఅవుతుంది.

కర్మలను త్యజించడం కంటే కర్మలను చెయ్యడమే మేలు.

తక్కువ కర్మలు చేయడంకన్నా

ఎక్కువ కర్మలు చేయడంఅన్నది ఉత్తమం.

ఎక్కువ కర్మలు చెయ్యడంకన్నా

ఇంకా ఎక్కువ కర్మలు చేయడంఅన్నది ఉత్తమోత్తమం.

పనులు మానేసి కూర్చుంటే శరీరపోషణ జరిగేదెలా ? …

జీవనయాత్ర సాగేదెలా ?

కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటై

ఆరోగ్యమూ, బుద్ధీ కూడా చెడే అవకాశం ఉంది.

నిజానికి కర్మలు చేయకపోతే భౌతికకాయం కూడా నిలవదు.

కనుక కర్మలు చెయ్యటంలో సోమరితనం ఎప్పుడూ తగదు.

ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకుని అలాంటి కర్మలే చెయ్యాలి.

శాస్త్ర సమ్మతమైన కర్మలే చెయ్యాలి

కర్మలు సత్కర్మలు, నిష్కామకర్మలు అయితే ఇంకా మంచిది.