భగవద్గీత 6-16

నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః |

న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ||

 

పదచ్ఛేదం

అతిఅశ్నతఃతుయోగఃఅస్తిఏకాంతంఅనశ్నతఃఅతిస్వప్నశీలస్యజాగ్రతఃఏవఅర్జున

ప్రతిపదార్థం

అర్జున = ఓ అర్జునా ; యోగః = ధ్యానయోగం ; అతి, అశ్నతః, తు = అతిగా భుజించేవాడికి ; , అస్తి = కలుగదు ; ఏకాంతం, అనశ్నతః, = ఏమాత్రం భుజించనివానికి ; = కలుగదు ; అతి, స్వప్నశీలస్య, = ఎక్కువగా నిద్రించేవాడికి ; జాగ్రతః, = ఎక్కువగా మేల్కొనేవాడికి; , ఏవ = కలుగదు

తాత్పర్యం

అర్జునా ! అతిగా తినేవాడికీ, మరి బొత్తిగా తిననివాడికీ, ఎక్కువగా నిద్రపోయేవాడికీ మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యానయోగం సిద్ధించదు ! ”

వివరణ

గౌతమ బుద్ధుడు కొన్నాళ్ళు పూర్తిగా ఆహారాన్ని త్యజించి,

ధ్యానం చేసి చూశాడు.

అయితే శరీరాన్ని శుష్కింప చేసుకుని సాధన చేస్తే ఫలితం ఉండదనీ

అది అనర్ధాలకు దారి తీస్తుందనీస్వానుభవం మీద గ్రహించాడు.

తాను చేయవలసిన ప్రయోగాలన్నీ చేసి, చివరకు మరీ ఎక్కువుగా కాకుండా,

మరీ తక్కువగా కాకుండా తగుమోతాదులో ఉండే మధ్యేమార్గాన్ని ప్రతిపాదించాడు.

అతిగా తింటే మత్తు, సోమరితనం, అజీర్తి

అవసరం కంటే తక్కువ తింటే ఆకలి, నిస్సత్తువ

కాబట్టి ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ,

తక్కువుగా తిని ఆకలితోనూ బాధపడక

అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం యుక్తంగా తీసుకోవాలి.

ఏకభుక్తే మహా యోగీ !

ద్విభుక్తే మహా భోగీ !

త్రిభుక్తే మహా రోగీ !

చతుర్భుక్తే సదా రోగీ !