భగవద్గీత 4-34

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ||

 

పదచ్ఛేదం

తత్విద్ధిప్రణిపాతేనపరిప్రశ్నేనసేవయాఉపదేక్ష్యంతితేజ్ఞానంజ్ఞానినఃతత్త్వదర్శినః

ప్రతిపదార్థం

తత్వదర్శినః = పరమాత్మతత్వం తెలిసిన ; జ్ఞానినః = జ్ఞానులు ; జ్ఞానం = ఆత్మజ్ఞానాన్ని ; తే = నీకు ; ఉపదేక్ష్యంతి = ఉపదేశిస్తారు ; ప్రణిపాతేన = సాష్టాంగ నమస్కారం చేసి ; సేవయా = సేవచేసి ; పరిప్రశ్నేన = వినయంతో ప్రశ్నించి; తత్ = ఆ తత్వజ్ఞానాన్ని ; విద్ధి = తెలుసుకో.

తాత్పర్యం

తత్త్వదర్శనులైన వారికీ, జ్ఞానులకూ, సాష్టాంగ నమస్కారం చేసి, వినయంతో ప్రశ్నించి, శుశ్రూష చేసి, ఆత్మతత్వం తెలుసుకోవాలి. ”

వివరణ

తత్త్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను

ఏ విధంగా సేవించి, ప్రశ్నించి, జ్ఞానాన్ని పొందాలి ?

విద్య నేర్చుకోవాలనుకునే శిష్యుడికి ఉండవలసిన గుణాలేమిటి ?

సత్యం తెలుసుకోవాలనే కోరిక గలసరి అయిన శిష్యుడుఉంటే

అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు.

ప్రణిపాతేన ” … సాష్టాంగ నమస్కారం చేసి

పరిప్రశ్నేన ” … వినయంతో ప్రశ్నించి

సేవయా ” … సేవ చేసి

ఈ మూడు లక్షణాలు శిష్యుడికి ఉండాలిఅంటున్నారు శ్రీవేదవ్యాసులవారు.

సాష్టాంగ నమస్కారంఅంటే ఎనిమిది అంగాలతో చేసే నమస్కారం.

చేతులు రెండు, కాళ్ళు రెండు, మొండెం ఒకటి, తల ఒకటి, మనస్సు ఒకటి,

బుద్ధి ఒకటిఈ ఎనిమిదీ కలిపి చేసే నమస్కారమే … “ సాష్టాంగ నమస్కారం ”.

కేవలం శరీరంతోనే కాదు, మనస్సునూ, బుద్ధినీ కూడా కలిపినమస్కరించాలి.

భౌతికకాయం మాత్రమే కాకుండా, మనఃకాయం, బుద్ధికాయం కూడా కలిపిప్రణమిల్లాలి. “ పరిప్రశ్నేనఅంటే సూటి ప్రశ్నలు వేయాలి.

ఆధ్యాత్మిక గురువుల దగ్గరకుఆధ్యాత్మికతకోసం

ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలిప్రాపంచిక విషయాల కోసం కాదు.

వినయంగా స్పష్టమైనసరియైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి.

ఆ తరువాతఆ గురువు ఏదన్నా కొంచెం సేవ చేయమని కోరితేతప్పకుండా ఆ సేవ చేయాలి.

ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరకు వెళ్ళి చేసే మొక్కుబడిసేవ

కాదు, మనఃపూర్తిగా చేసేదేసేవ ”. సేవ అంటే గురువుకు శుశ్రూష

చేయడమనే కాదు … “ స్వంత పనిఅనేది లేకుండా ఎల్లప్పుడూ

గురువుగారి ద్వారా జరిగే లోకకళ్యాణ కార్యాల వినియోగార్థంతన్, ధన్, మనస్సులను లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ.

ఈ ప్రపంచంలో జ్ఞానులు, తత్త్వాన్ని దర్శించినవారు ఎంతో మంది ఉన్నారు.

అందరి దగ్గర నుండీ ఆ జ్ఞానాన్ని పొందాలి.