భగవద్గీత 6-12

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |         

ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే ||

పదచ్ఛేదం

తత్రఏకాగ్రంమనఃకృత్వాయతచిత్తేంద్రియక్రియఃఉపవిశ్యఆసనేయుంజ్యాత్యోగంఆత్మవిశుద్ధయే

ప్రతిపదార్థం

తత్ర, ఆసనే = (సుఖ) ఆసనం మీద; ఉపవిశ్య = కూర్చుని ; యతచిత్తేంద్రియక్రియః =ఇంద్రియ, మనోవ్యాపారాలను వశంలో వుంచుకొని ; మనః = మనస్సును ; ఏకాగ్రం, కృత్వా = ఏకాగ్రం చేసి ; ఆత్మవిశుద్ధయే = అంతఃకరణశుద్ధి కోసం ; యోగం = యోగాన్ని ; యుంజ్యాత్ = సాధన చెయ్యాలి

తాత్పర్యం

ఆ సుఖ ఆసనం మీద కూర్చుని ఇంద్రియాలనూ, మనస్సునూ స్వాధీనం చేసుకుని, అంతఃకరణశుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యానయోగసాధన చెయ్యాలి. ”

వివరణ

కూర్చోడానికి అనుకూలమైన, స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చుకుని

దాని పైన ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా, సుఖంగా

ఉండే విధంగా కూర్చోవాలి.

ఆ తర్వాత ఇంద్రియాలనూ, మనస్సునూ ప్రాపంచిక విషయాలనుండి మళ్ళించి

మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానయోగాన్ని అభ్యసించాలి

ధ్యానయోగసాధన చెయ్యాలి.

దీనికోసం శ్వాసను గమనించాలి

శ్వాసను మాత్రమే గమనించాలిగమనిస్తూఉండాలి.

మధ్యమధ్యలో ప్రాపంచిక సంబంధిత ఆలోచనలు ఏవేవి వచ్చినా

మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదకే మరల్చాలి.

అప్పుడు ఇంద్రియ, మనో వ్యాపారాలన్నీ అరికట్టబడతాయి.

సహజంగానే ఆలోచనారహిత స్థితికి చేరుతాం

ధ్యానస్థితికి చేరుతాం

అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది.

ఎన్నో జన్మలలోని కుకర్మల కారణంగా

అంతరంగం అన్నది విశేషంగా అశుద్ధం అయి వున్నప్పుడు

ఈ వర్తమాన జన్మలోని విశేష ధ్యానసాధన ద్వారానే మరి

ఆ అంతరంగం పరిశుద్ధం అయ్యేది.

దీనినేధ్యానయోగసాధనఅంటాం.