భగవద్గీత 4-13

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||

 

పదచ్ఛేదం

చాతుర్వర్ణ్యంమయాసృష్టంగుణకర్మవిభాగశఃతస్యకర్తారంఅపిమాంవిద్ధిఅకర్తారంఅవ్యయం

ప్రతిపదార్థం

చాతుర్వర్ణ్యం = ‘ బ్రాహ్మణ ’, ‘ క్షత్రియ ’, ‘ వైశ్య ’, ‘ శూద్రఅనే నాలుగు వర్ణాల సమూహం ; గుణకర్మ విభాగశః = గుణాల చేత , మరి కర్మల యొక్క విభాగాలను అనుసరించి ; ‘మయా’ = ‘ నాచేత ’ ; సృష్టం = సృష్టించబడ్డవి ; తస్య, కర్తారం, అపి = దానికి కర్తను అయినప్పటికీ ; ‘ మాం ’ = ‘ నన్ను ’ ; అవ్యయం = అవినాశిగానే ; అకర్తారం = అకర్తగానే ; విద్ధి = తెలుసుకో

అర్జునుడు = నేను శరీరం అనుకునే తత్వం

శ్రీకృష్ణుడు = నేను ఆత్మ అనే తత్వం

నేను = ఆత్మ

భగవాన్ ఉవాచఆత్మ ఉవాచ:-

“ ‘ బ్రాహ్మణ ’, ‘ క్షత్రియ ’, ‘ వైశ్య ’, ‘ శూద్రులు ’ … అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించినా చేత ’ … సృష్టించబడింది; ఈ రకమైన సృష్టి రచనకు కర్తనునేనేఅయినప్పటికీ నాశరహితమైననన్ను ’ … ‘ అకర్తగానే నువ్వు తెలుసుకో ”.

వివరణ

ఎక్కడెక్కడమాం ’, ‘ మయిఅని వచ్చినా కూడా అవి ధ్యానానికి/ ఆత్మకు

సూచికలు అన్నది మనం గుర్తుంచుకోవాలి.

అవి కృష్ణునికి సూచికలు ఎంత మాత్రం కావు !

వర్ణంఅంటే రంగుమనిషి యొక్కఆరారంగు !

ఆరాఅంటేఆస్ట్రల్ బాడీఅంటే … ‘మనోమయకోశం’.

ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ వుంటాయి !

మనస్సుక్రోధంగా వున్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది.

మనస్సులేకిగా వున్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి వుంటుంది.

ఈ రంగులనుశూద్రవర్ణంగా, ‘ తమోగుణంగా అభివర్ణించారు !

గ్రుడ్డిగానేనేసత్యంఅనివాదిస్తున్నప్పుడునల్లటిఆరంజిరంగుకలిగి

వుంటుంది. ఈ రంగును, నల్లటి ఆకుపచ్చ రంగును,

వైశ్యవర్ణంగా, ‘ రజోగుణంగా అభివర్ణించారు !

మనస్సునాకు తెలియదుఅని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలిరంగు కలిగి వుంటుంది.

పునర్జన్మమరికర్మసిద్ధాంతంల అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి వుంటుంది.

ముముక్షువుగా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు ఇండిగో రంగుని కలిగి ఉంటుంది.

ఈ రంగులనుక్షత్రియ వర్ణంగా, ‘ సాత్విక వర్ణంగా అభివర్ణించారు.

మనస్సు పూర్తిగాశుద్ధంఅయినప్పుడు

అహం బ్రహ్మాస్మిఅని తెలుసుకున్నప్పుడు

పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి వుంటుంది.

ఈ రంగునుబ్రాహ్మణ వర్ణంగా, ‘ శుద్ధ సాత్వికంగా లేదానిర్గుణంగా అభివర్ణించారు.

దివ్యచక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు.

అంతర్ గుణాన్ని బట్టే బహిర్ కర్మ సదా వ్యక్తం అవుతూ వుంటుంది !

బయట కర్మను బట్టి అంతర్ గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతుంది.

తమోగుణం లోని వారిని శూద్రులుగా

రజోగుణం లోని వారిని వైశ్యులుగా

సాత్విక గుణం లోని వారిని క్షత్రియులుగా

శుద్ధసాత్విక లేదా నిర్గుణం వారిని బ్రహ్మణులుగా

పూర్వపు ఋషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు.

పైన వున్నమాస్టర్స్ ’, దేవుళ్ళు ఎప్పుడూ

క్రింద వున్న మానవులగుణకర్మలను నిర్దేశించరు !

ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ వుంటారు.

మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం

మనం ఎవరమో నిర్ణయించుకుంటాం.

బ్రాహ్మణకులంలో పుడితే బ్రాహ్మణులం కాము.

మనం బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం.

మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం

పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు

రాజుగారికి పుట్టినా క్షత్రియుడు కాలేడు.

ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు.

ఈ మూడు గుణాలూ లేని వాడేశూద్రుడుఅనిపించుకుంటాడు.

కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం.

మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం !

మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం !

నేనుఆత్మ అన్న పదార్థం ఒకప్రక్క నిరంతరంగా,

మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా

మరొక ప్రక్క దేనినీ సృష్టించనిదేనికీ కర్త గానిఅవినాశి అయిన

అవ్యయమైనమూల పదార్థంఅని కూడా తెలుసుకోవాలిఅదే జ్ఞానం !

అంటే ప్రతినేనుకూడా

ప్రతిఆత్మకూడా

ఒకప్రక్క సృష్టికర్తమరొక ప్రక్క సృష్టిసాక్షి !

గుణకర్మల విభాగాన్ని అనుసరించి వర్ణాల సముదాయం