భగవద్గీత 4-18

 కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః |          

సబుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ||

 

పదచ్ఛేదం

కర్మణిఅకర్మయఃపశ్యేత్అకర్మణికర్మయఃసఃబుద్ధిమాన్మనుష్యేషుసఃయుక్తఃకృత్స్నకర్మకృత్

ప్రతిపదార్థం

యః = ఎవరైతే ; కర్మణి = కర్మలో ; అకర్మ, పశ్యేత్ = అకర్మను చూస్తాడో ; యః చ = ఎవరైతే ; అకర్మణి = అకర్మలో ; కర్మ = కర్మను చూస్తాడో ; సః = అతడు ; మనుష్యేషు = మనష్యులలో ; బుద్ధిమాన్ = బుద్ధి కలిగిన వాడు ; సః = అతడే ; యుక్తః = సరైనవాడు ; కృత్స్నకర్మకృత్ = సమస్త కర్మలను చేసేవాడు.

తాత్పర్యం

కర్మలలో అకర్మనూ, అకర్మలలో కర్మనూ దర్శించేవాడే బుద్ధిమంతుడు ; అతడు సర్వ కర్మలనూ ఆచరించినట్లే. ”

వివరణ

ఏ మానవుడు కర్మలలో అకర్మనూ, అకర్మలో కర్మనూ చూస్తున్నాడో

అతడే మనుష్యులలో బుద్ధిమంతుడైనవాడు.

అతడే యోగయుక్తుడై సమస్త కర్మలనూ ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు.

ఒకానొక వ్యక్తి తన శారీరక పరమైన, కుటుంబ పరమైన, సామాజిక పరమైన ధర్మాలు నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కంటికి కనిపించే వ్యవహారాలేకర్మలు”.

మన మనస్సులో కలిగే భావాలు, ఆలోచనలే అంతరకర్మలు.

మనస్సులో సూక్ష్మరూపంలో ఆలోచనలుగా ఉన్న అంతరకర్మలే

శక్తి సమకూర్చుకుని బాహ్యప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి.

కనుకకర్మలవెనుకఉన్నభావాలుపవిత్రంగానిర్మాణాత్మకంగాఉంటే

అవి ఐహిక పురోభివృద్ధికీ, ఆముష్మిక ఆత్మాభివృద్ధికీ దోహదం చేస్తాయి.

కర్మలను ఆచరించేటప్పుడు మనస్సులో సమత్వభావాన్ని స్థిరపరచుకుని

కర్మఫల ఆసక్తినీ, అత్యాశలనూ విడిచి

అహంకార రహితంగా, సాక్షీభూతంగా ఉండి కర్మలు చేస్తేఅవి బంధాలను కలిగించలేవు.

ఆ రకంగా కర్మలు చెయ్యడమేకర్మలలో అకర్మను చూడడంఅవుతుంది.

కర్మలను చేస్తూ కూడా కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండడంకర్మలలో అకర్మను చూడడంఅవుతుంది.

ధ్యానమే అసలైన అకర్మ.

ఇది తెలుసుకుని ధ్యానం చెయ్యడమే అకర్మలో కర్మను చూడడం.

ఏ పనీ చేయకుండా ఊరికే కళ్ళు మూసుకుని కూర్చున్నారు ”.

అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి !

బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మల క్రిందే లెక్క !

ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్న వాడే బుద్ధిమంతుడు, యుక్తపురుషుడు.

ఏది యుక్తమో, ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు.

తన యొక్క సత్త్వ, రజో తమోగుణాలే వాటికి సంబంధించిన కర్మలను చేస్తున్నాయి గానీ, తానేమీ చేయటం లేదనీ, తాను ఎల్లప్పుడూ, ప్రతి కర్మకూసాక్షీభూతుడనేఅని  గ్రహించినవాడే బుద్ధిమంతుడు.

యోగులను అందరూ ఏమీ చెయ్యనివాడిగా పరిగణిస్తారు.

కానీ సాక్షీభూతుడుగా ఉండడమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు.

కృత్స్నకర్మకృత్అంటే చేయవలసింది అంతా చేసేసి, పొందవలసినది అంతా పొందినవాడు.

ఆ శ్రీకృష్ణపరమాత్మ, ఆ వేదవ్యాసులవారు చెయ్యవలసినది ఏమీ మిగిలి లేదు.

వారు చెయ్యవలసినది అంతా చేసేసి, పొందవలసినది అంతా పొందినవారు.

వారు వాసనా బద్ధులు కారు, వాసనారహితులు.

కనుక వారిది జన్మ కాదు, అవతారం.

వారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం కోసం మాత్రమే !

వేదవ్యాసులు, నారదుల వంటివారు అవతరించినది లోకానికి మార్గదర్శకత్వం కోసం మాత్రమే !