భగవద్గీత 13-2

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||

పదచ్ఛేదం

ఇదంశరీరంకౌంతేయక్షేత్రంఇతిఅభిధీయతేఏతత్యఃవేత్తితంప్రాహుఃక్షేత్రజ్ఞఃఇతితద్విదః

ప్రతిపదార్థం

కౌంతేయ = కుంతీకుమారా ; ఇదం, శరీరం = ఈ శరీరం ; క్షేత్రం, ఇతి = ‘క్షేత్రంఅని ; అభిధీయతే = పిలువబడుతుంది ; ఏతత్ = దీనిని గురించి ; యః , వేత్తి = ఎవరు తెలుసుకుంటారో ; తం = అతనిని ; క్షేత్రజ్ఞః , ఇతి = ‘క్షేత్రజ్ఞుడుఅని ;

తద్విదః = తత్త్వజ్ఞానులు ; ప్రాహుః = అంటారు

తాత్పర్యం

ఓ కుంతీపుత్రుడా, క్షేత్ర క్షేత్రజ్ఞులను గురించి తెలిసినవారు ఈ శరీరమే క్షేత్రం అనీ, దీనిలో వ్యవహరిస్తూ వుండేవాడు క్షేత్రజ్ఞుడు అనీ చెపుతారు. ”

వివరణ

క్షేత్రంఅంటే శరీరం

జడమైన శరీరాన్ని నడిపే చైతన్య శక్తి ఏదైతే వుందో

అదేక్షేత్రజ్ఞుడు ” … ఆత్మ.

జీవుడు నిజానికి క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాడు.

దేహంవేరే … “ దేహివేరే.

దేహంక్షేత్రం ’ … దేహిక్షేత్రజ్ఞుడు

క్షేత్రంఅంటేపొలంఅని కూడా అర్థం.

పొలంలో నాటిన విత్తనాలు తగిన సమయంలో

పంట రూపంలో మొలకెత్తుతాయి.

అలాగే జీవుడి యొక్క కర్మలు కూడా సమయం వచ్చినప్పుడు

ఈ శరీరం అనే క్షేత్రంతోనే అనుభవిస్తూంటాడు.

శరీరం ఉత్పత్తి, నాశనాలను కలిగి వుంటుంది.

కానీక్షేత్రజ్ఞుడుమాత్రం ఉత్పత్తి, నాశనాలు లేని నిత్యుడు

క్షేత్ర, క్షేత్రజ్ఞ జ్ఞానం కలిగినవాడుఅంటే

వివేకం కలిగినవాడుఅని అర్థం

నిత్య, అనిత్య వివక్ష ఉన్నవాడుఅని అర్థం.