భగవద్గీత 2-11

       “ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

        గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || ”

 

పదచ్ఛేదం

అశోచ్యాన్అన్వశోచఃత్వం –  ప్రజ్ఞావాదాన్భాషసేగతాసూన్అగతాసూన్అనుశోచంతిపండితాః

ప్రతిపదార్థం

త్వం = నువ్వు ; అశోచ్యాన్ = శోకింపదగనివారిని గురించి ; అన్వశోచః = శోకిస్తున్నావు ; = అంతేకాక ; ప్రజ్ఞావాదాన్ = ప్రజ్ఞావంతులలాగా ; భాషసే () = మాటలాడుతున్నావు (కానీ) ; గతాసూన్ = మరణించిన వారి గురించి; = మరి ; అగతాసూన్ = బ్రతికి ఉన్న వారిని గురించిపండితాః = ఆత్మజ్ఞానం పొందినవారు అనుశోచంతి = దుఃఖించరు

తాత్పర్యం

దేని కోసం దుఃఖించకూడదో, దానికోసం దుఃఖిస్తూపై పెచ్చు పెద్ద ఆరిందాలా మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి గానీ, విగత జీవుల గురించి గానీ ఏమాత్రం దుఃఖించరు సుమా ! ”

వివరణ

ప్రజ్ఞ ”, “ శోకంఅనేవి రెండూ పరస్పర విరుద్ధ అంశాలు

రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు.

ప్రజ్ఞ కలిగినవాడుపండితుడు ”.

ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ చనిపోయే వాడే ‘ …

అన్న సత్యం పండితుడికి తెలుసు.

ఒకానొక చనిపోయినవాడి కోసం గానీ,

ఒకానొక చనిపోబోయేవాడి కోసం గానీఅంటే

ఉన్నవాడిని గురించి కానీ, పోయినవాడిని గురించి కానీ

పండితుడుఎప్పుడూ శోకించడు.

పండితుడు దేనికీ ఏడవడు

ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతూంటాడు.

వదనంలో విషాధ ఛాయలు కూడా ఉండవు

ఎప్పుడూ ఆనందమే ఆనందం !

అర్జునుడు ఒక ప్రక్కన తన

బంధువులు, గురువులు

యుద్ధంలో చనిపోతారు అని ఏడుస్తున్నాడు.

ఇంకొక ప్రక్కనరక్తపాతం ఎందుకు

చెయ్యాలి? ” అనీ

భిక్షాటన చేసి బ్రతుకుతానుఅనీ

గొప్పగొప్ప మాటలు మాట్లాడుతున్నాడు.

అంటే ఒక ప్రక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు

ఇంకొక ప్రక్కన పండితుడిలాగా మాట్లాడుతున్నాడు

దేనికైనా ఏడ్చేవాడుపామరుడు

దేనికీ ఏడవనివాడేపండితుడు

పండితుడుఅంటే అత్మశాస్త్రం అవగతమయినవాడు.

పామరుడుఅంటే ఆత్మశాస్త్రం ఎంతమాత్రం అవగతం కానివాడు.