భగవద్గీత 10-20

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ||

 

పదచ్ఛేదం

అహంఆత్మాగుడాకేశసర్వభూతాశయస్థితఃఅహంఆదిఃమధ్యంభూతానంఅంతఃఏవ

ప్రతిపదార్థం

గుడాకేశ = నిద్రను జయించినవాడా ; సర్వభూతాశయ స్థితః = సమస్త ప్రాణులలో ఉన్న ; ఆత్మా = ఆత్మను ; అహం = నేను ; = మరి ; భూతానాం = సకల ప్రాణులకు ; ఆదిః = మొదలు ; మధ్యం = మధ్య ; = ఇంకా ; అంతః చ = మరి అంతమునూ (ప్రాణుల సృష్టిస్థితిలయల కారణం) ; అహం ఏవ(అస్మి) = నేనే

తాత్పర్యం

అర్జునా ! సమస్త ప్రాణులలో వుండే ఆత్మను నేనే ! సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడూ కూడా నేనే ! ”

వివరణ

నిద్రను జయించినవాడు అర్జునుడు.

ఇంద్రియాలను జయించినవారు అతి కొద్దిమంది ఉంటారు.

అటువంటి వారుపాండవులు ”.

ఇంద్రియాలకు లోబడినవారు కోకొల్లలు.

అటువంటి వారుకౌరవులు ”.

ఇంద్రియాలు జయించినవారికే ఆత్మతత్త్వం అర్థమవుతుంది గానీ

ఇంద్రియాలకు లోబడినవారికీ,

ఇంద్రియాలలో మునిగి కొట్టుకుపోయే వారికీ

ఆత్మతత్త్వంఎంతమాత్రంమింగుడుపడదు

కృష్ణుడు ”, “ ఓ వేదవ్యాసుడు ” .. పాండువులవంటి వారికే అవసరం ;

నేర్చుకునే తత్త్వంలేని వారు కౌరవులు

వాళ్ళకు ప్రాపంచిక రాజ్యాలే కావాలి

వాళ్ళకు ఆత్మ యొక్క సిద్ధత్వంతో పనిలేదు.

ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధించబడుతుంది.

అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు.

ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో ఒకానొక పరిస్థితిలో మాత్రమే ఉన్నదిదేహం ”.

కానీ సర్వ దేశాలలో, సర్వ కాలాలలో సర్వ పరిస్థితులలో

సర్వత్రా వ్యాపించి ఉన్నదిఆత్మ

ఆత్మఅన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ వుండేది

భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ వుండేది ..

మరి భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉండేది.

భౌతికమైన సృష్టి అంతం కావచ్చు … “ ఆత్మపదార్ధంమట్టుకు అంతం కాదు

ఆత్మఒకానొక భౌతికమైన సృష్టిలోంచి

మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్ళి ఉంటూ వుంటుంది ..

ఇలా తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం.