భగవద్గీత 9-22

అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||

 

పదచ్ఛేదం

అనన్యాఃచింతయంతోమాంయేజనాఃపర్యుపాసతేతేషాంనిత్యాభియుక్తానాంయోగక్షేమంవహామిఅహం

ప్రతిపదార్థం

అనన్యాః = ఇతర భావాలు లేక ; యే జనాః = ఎవరైతే ; “ మాం ” = “ తనను తాను” ; చింతయన్తః = చింతన చేస్తూ ; పర్యుపాసతే = సేవిస్తారో ; నిత్యాభియుక్తానాం = నిరంతరం నన్నే ధ్యానించే ; తేషాం = వారి యొక్క ;

యోగక్షేమం = యోగక్షేమాలను ; అహం = నేనే ; వహామి = వహిస్తాను

తాత్పర్యం

వేరే ఆలోచనలు లేకుండా నిత్యమూ తనను తానే నమ్ముకొని, తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే వుంటూ, తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ”

వివరణ

మన పనులను మనం చేసుకుంటూనే వుండాలి.

అప్పుడు పరమ ఆత్మలు ఆశ్రీకృష్ణుడు ”, వేదవ్యాసుడు ” ..

ఎవరో ఒకపరమ ఆత్మ ” ..

ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపేపరమ ఆత్మ” ..

మన యోగక్షేమాలను తానే వహిస్తుంది.

ప్రాపంచికంగా, భౌతికంగామనకు ఇచ్చే రక్షణక్షేమంఅనబడుతుంది.

యోగంఅంటేఆధ్యాత్మిక పురోగతి

ప్రాపంచిక, ఆధ్యాత్మిక రక్షణా కవచంగా

ఒకానొక పరమ ఆత్మ ” … మనకు సిద్ధంగా ఉంటారు.

మనం చెయ్యవలసిందల్లా ఒక్కటేఆత్మధర్మాన్ని నిర్వర్తించడం

మన ధ్యానంలో మనం ఉండడం !

శుభాలనూఅశుభాలనూ మనస్సులో వదలిపెట్టెయ్యగలగడం

మన వశంలో మనం ఉండడం ! … మన యోగంలో మనం ఉండడం !

ప్రహ్లాదుడు ఎప్పుడూ ధ్యానంలో వుండేవాడు.

ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రయత్నించినా గానీ రక్షింపబడ్డాడు.

మన ప్రక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమ ఆత్మ

ఆస్ట్రల్ మాస్టర్గైడ్ !

మన కళ్ళకు కనిపించడు కానీ

తాను మనకు చెయ్యవలసింది మాత్రం చేస్తాడు.

కనుక మనం చెయ్యవలసింది మనం చేస్తే

మన యోగక్షేమాలు పరమ ఆత్మలు చూసుకుంటారు.

ధ్యానం రక్షతి రక్షితం ! ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది!