ఒంగోలు పట్టణం – ప్రకాశం జిల్లా

“పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ఆవిష్కరణ”

“పత్రీజీ సందేశం”

“ప్రపంచానికంతటికీ ధ్యానాన్నీ మరి శాకాహార జీవన విధానాన్నీ అందించడానికే మనం ‘పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్’ని ఆవిష్కరించుకున్నాం. పిరమిడ్ శక్తి గురించి విశేష ప్రచారం చేస్తూ పిరమిడ్ ధ్యానం ద్వారా అందరినీ ఆరోగ్యవంతులుగా, సాహసోపేతులుగా మరి కాస్మిక్ సిటిజెన్స్‌గా చేద్దాం.”

“ఆనందోబ్రహ్మ వార్షికోత్సవాలు”

 

AUG 12వ తేదీ

 

“జీవితం అంటే ధ్యానం, సంగీతం, నృత్యం! ఇదే ఆనందం. ఇంతకంటే ఒక మనిషికి జీవించడానికి ఇంకేమీ అవసరం లేదు. డబ్బు, చదువు, ఆస్తి, కీర్తి ప్రతిష్టలు అన్నీ వీటి తరువాతే. ఇది తెలియకనే ప్రజలంతా నానారకాల బాధలకూ, దుఃఖాలకూ, కష్టాలకూ, అనారోగ్యాలకూ గురి అవుతున్నారు.

 

AUG 13వ తేదీ

 

“మన అరచేతికి అయిదు వ్రేళ్ళు ఉన్నాయి. అందులో చిటికెన వ్రేలు ఆటలకూ, ఉంగరం వ్రేలు కళలకూ, మధ్య వ్రేలు చదువులకూ, చూపుడు వ్రేలు పనులకూ మరి బొటన వ్రేలు ధ్యానానికీ ప్రతీకలు! ఈ రకంగా మనం అన్ని రంగాలకూ ప్రాధాన్యత ఇస్తూ అన్నీ సమపాళ్ళలో అనుభవిస్తూ .. జీవించినప్పుడు మన జీవితం అంతా కూడా ‘ఆనందో బ్రహ్మ’గా మారిపోతుంది” అంటూ నిజ జీవితంలో ఆచరించవలసిన కర్తవ్య కర్మలను గురించి అతి సరళమైన రీతిలో వివరించారు.