“ధ్యాన యువత ప్రాజెక్ట్ … పైమా”

 

మూఢ నమ్మకాలు, మూఢాచారాలూ, మూఢ భక్తిరీతులూ, పుక్కిటి పురాణాలూ, మరి మతాచారాలూ యువతను యుగయుగాలుగా నిర్వీర్యం చేస్తున్నాయి. యువతలో సహజంగా ఉండాల్సిన ఆత్మవిశ్వాసంపై అన్ని వైపుల నుంచి అజ్ఞానపు దాడులు జరిగి యువతరం అంతా చేతగాని చవటల్లా చేష్టలుడిగి తమ జన్మలను వృథా చేసుకుంటున్నారు. ఆత్మజ్ఞానలోపంతో మ్రగ్గిపోతున్న యువతకు సరియైన అధ్యాత్మిక మార్గాన్ని చూపి వారి చీకటి బ్రతుకులలో నవీన ఆధ్యాత్మిక వెలుగులు నింపారు బ్రహ్మర్షి పత్రీజీ.

యువకుల్లో యువకుడిగా… “Catch People Young” అంటూ మొక్క దశలోనే యువతకు సత్యం, ధర్మం అన్నది తెలియజేస్తూ వాళ్ళని లీడర్స్‌లా ఎదగనిస్తున్న బ్రహ్మర్షి పత్రీజీకి… “పైమా లోకం” శిరస్సు వంచి ధ్యానాభివందనం చేస్తోంది.