“ధ్యాన మహిళ ప్రాజెక్ట్”

 

ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ సర్వశుభాలూ సమకూరుతాయి. కనుక సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల కోసం ధ్యాన కార్యక్రమాలు చేపడుతోంది…ధ్యాన మహిళ ప్రాజెక్ట్”

స్త్రీ శక్తిని సంపూర్ణంగా వినియిగించుకోబడిన సమాజమే… సంపూర్ణ సమాజం కనుక… స్త్రీలలో నిద్రాణమై ఉన్న అనేకానేక సృజనాత్మక శక్తులను బయటకు తీయగలుగుతోంది ధ్యానం. స్త్రీలలో ఉన్న ప్రేమ, కరుణ, దయ, సహనం వంటి దివ్య లక్షణాలు మాత్రమే ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో సమాజాన్ని రక్షించగల దివ్యాయుధాలు కనుక అనేకానేక “ధ్యాన మహిళా విజయోత్సవాలు” నిర్వహిస్తూ… స్త్రీలతో పాటు పురుషుల్లో కూడా నిద్రాణంగా దాగి ఉన్న స్త్రీతత్వపు దివ్య లక్షణాలను బయటికితెస్తోంది “ధ్యాన మహిళా ప్రాజెక్ట్”. ఇందులో భాగంగానే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళలచే నిర్వహింపబడే “ది వైజాగ్ పిరమిడ్ ట్రస్ట్” ఏర్పాటు చేసి బ్రహ్మర్షి పత్రీజీ… మహిళలను ఇంకా ఇంకా ఉత్సాహపరుస్తున్నారు.