“ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు”

 

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ… “ఆధ్యాత్మికత అంటే అకుంఠిత విగ్రహపూజ మాత్రమే” అనుకుంటున్నారు. “ఆధ్యాత్మికత అంటే దీక్షతో కూడిన ధ్యానసాధన” అని వారికి తెలియజేయడానికి ప్రతి గ్రామస్థాయిలోనూ “పిరమిడ్ ధ్యానం” వచ్చితీరాలి. అన్ని గ్రామాల్లోనూ ఇతోధికంగా పిరమిడ్‌లు నిర్మించబడాలి.. మరి గ్రామ ప్రజలంతా సామూహికంగా ప్రతిరోజూ ధ్యానం చేసుకునే రోజులు రావాలి. గ్రామాల్లో అందరూ కూడా వైద్యం కోసం పట్టణాలకు పోవడం అన్నది సంపూర్ణంగా మానుకోవాలి.

గ్రామాల్లోని ప్రజలు… అసలే పేదవాళ్ళు… పైగా పొగత్రాగడం, మద్యం సేవించడం లాంటి చెడు అలవాట్లు వీరిని మరింతగా కృంగదీస్తున్నాయి. గ్రామ ప్రజలందరికీ “ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే వుంది” అని కట్టుదిట్టంగా తెలయజేసి వారి ఆరోగ్యాన్ని వారే కాపాడుకునే విధంగా వారిచే ధ్యానసాధన చేయించాలి. బీద ప్రజానీకానికి నిజమైన తరుణోపాయ మార్గం ధ్యానమే. “శ్వాస మీద ధ్యాస” ద్వారా దేహారోగ్యాన్ని, బ్రహ్మానందాన్ని గ్రామప్రజలందరూ పొందాలి. పిరమిడ్ మాస్టర్లు వారి చుట్టు ప్రక్కల గ్రామాలన్నీ కూడా “ధ్యాన గ్రామాలు”గా తీర్చిదిద్దడానికై బ్రహ్మర్షి పత్రీజీ నూతన ఆవిష్కారమే “ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్”.