“ధ్యాన ఆరోగ్య ప్రాజెక్టు”

 

“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నారు పెద్దలు. ఆరోగ్యమంటే .. శారీరకమైన స్వస్థత, మానసికపరమైన స్వస్థత మరి ఆత్మపరమైన స్వస్థత.. తద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందదాయకమైన సమాజాన్ని స్థాపించడం. అంతేకాని “ఆరోగ్యం” అంటే “రోగాలు లేకుండా ఉండటం” అన్నది కానేకాదు.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లోని మాస్టర్స్ మరి డాక్టర్స్ అందరూ కలిసి ఆవిష్కరించిందే.. “ధ్యాన ఆరోగ్యం” ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలందరికీ మూడు రకాల ఆరోగ్యం సత్వరం పొందడానికి.. ధ్యానం మరి శాకాహారం యొక్క అత్యావశ్యకతను తెలియజేయబడుతుంది. ధ్యానం ద్వారా విశ్వశక్తిని పొందుతూ మరి ఆత్మజ్ఞానం ద్వారా కర్మలను దగ్ధం చేసుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్ట్ మౌలిక లక్ష్యం. ప్రతి చిన్న అనారోగ్యానికీ బెంబేలెత్తిపోతూ హాస్పిటల్స్ చుట్టూ పరిగెత్తి ఇంకా ఇంకా సమస్యల్లో కూరుకుపోయే వాళ్ళందరికీ “ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్ట్” ఒక వరంగా మారి ప్రజలకు వారి స్వస్థితి పట్ల అవగాహనను కలుగజేస్తూ వారి స్వస్థతకు దోహదం చేస్తోంది.