“ధ్యాన అధ్యాపకుల ప్రాజెక్ట్”

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం చేసే మాస్టర్లతో పాటు విద్యారంగాల్లోని వివిధ స్థాయిల్లో ఉన్న టీచర్లకు కూడా టీచర్ ట్రైనింగ్ క్యాంపుల ద్వారా ఈ ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది “ధ్యాన అధ్యాపకుల ప్రాజెక్ట్”.

ఆత్మవిజ్ఞానంతో విలసిల్లే అధ్యాపకులు మాత్రమే విద్యార్థి యొక్క ఆత్మస్థితినీ, జీవకాంతినీ మరి వాడి జన్మ ప్రణాళికనూ గుర్తించి మరి ధ్యానంతో పాటు చక్కటి ఆత్మజ్ఞాన అవగాహనను విద్యార్థులకు కలుగజేస్తూ సత్యయుగ నిర్మాణం చేయగలుగుతారు. కాబట్టి ఈ సమాజంలో “గురుబ్రహ్మ” అంటూ అధ్యాపకుడిని ఒక దైవంలా గౌరవిస్తూ “ధ్యాన అధ్యాపకుల ప్రాజెక్ట్” ద్వారా టీచర్లందరికీ ధ్యాన ప్రచారాలు నిర్వహిస్తున్నారు … మన పిరమిడ్ మాస్టర్లు.