పత్రీజీ సందేశం

“మనం అంతా కూడా ఇదివరకే పై లోకాలలో ఈ యజ్ఞాలన్నీ చేసి ఇప్పుడు వాటిని ఇక్కడ భూమి మీద నిర్వహించాలన్న సంకల్పంతో జన్మ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వీటిని విజయవంతంగా పూర్తి చేయడం మనకు ఎంతో సులభం! ఈ సంగతి మరచిపోవద్దు! అది అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే సాధ్యం”

మదనపల్లి – చిత్తూరు జిల్లా

“ప్రతి మనిషి విధిగా శాకాహారి కావాలి”

 

“ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారానే జ్ఞానం మరి జ్ఞానం ద్వారానే ముక్తి సంప్రాప్తిస్తాయి. నేను ధ్యానం చేశాను కాబట్టే ఈ రోజు ఇన్ని వేలమంది స్నేహితులు నాకు లభించారు. మీరు కూడా ధ్యానం చేస్తే మీకు కూడా వేలకు వేలమంది స్నేహితులు లభిస్తారు. సరియైన పుస్తకాలను చదవడం ద్వారా సరియైన చక్కటి ఆత్మజ్ఞానం వస్తుంది. సాక్షాత్తు భగవంతుడయిన శ్రీకృష్ణుడు నరుడయిన అర్జునునికి బోధించిన ఆత్మవిజ్ఞాన గ్రంథం అయిన భగవద్గీతను ప్రతి ఒక్క ధ్యాని చదవాలి. అందులోని సమాచారాన్ని ఆకళింపు చేసుకోవాలి మరి ఆచరణలో పెట్టాలి. ఖురాన్, బైబిల్ గ్రంథాలను కూడా చదివి అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

“ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి విధిగా సంపూర్ణ శాకాహారి కావాలి. మాంసం, కోడి, చేప, గ్రుడ్డు, వెల్లుల్లి, పుట్ట గొడుగులు ఇవన్నీ కూడా తక్షణం వదిలి పెట్టేయ్యాలి” అంటూ అందరిచే శాకాహార నినాదాలు పలికించారు.