శ్రీ లక్ష్మీ రాఘవేంద్ర – బ్రిస్టల్ – UK

“హాయిగా జీవించడం నేర్చుకున్నాం”

పత్రీజీ సందేశం

“మన జీవితం ఒక గొప్ప కార్యనిర్వహణా స్థలం! ఇందులో ‘బాడీ డిపార్ట్‌మెంట్’, ‘ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్’, ‘మైండ్ డిపార్ట్‌మెంట్’, ‘ఫైనాన్సియల్ డిపార్ట్‌మెంట్’, ‘సోల్ డిపార్ట్‌మెంట్’ అంటూ అనేక డిపార్ట్‌మెంట్‌ల ద్వారా మన నిత్య జీవిత కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి.

“ఇవన్నీ కూడా సక్రమైన రీతిలో సమర్థవంతంగా నడుపబడాలంటే మనకు ధ్యానశక్తితో పాటు ఆత్మజ్ఞానం తప్పక ఉండి తీరాలి! అందుకు ధ్యానంతో పాటు ఆత్మసత్యాన్ని తెలియజేసే నవీన ఆధ్యాత్మిక గ్రంథాల విజ్ఞానం కావాలి. మరి సజ్జన సాంగత్యాలలో పాల్గొనాలి” అని తెలియజేశారు.

“శ్రద్ధ మరి అంకితభావాలతో మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలం. అలాగే ధ్యానసాధన కూడా! రకరకాల జీవిత అనుభవాల ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికీ మరి దానిని అనుభూతి చెందడానికీ మనం అందరం కూడా ఈ భూమి మీద జన్మించాం. అందుకే మనం .. ఈ మార్గంలో రకరకాల ప్రయోగాలు చేసి సత్యదర్శనం పొందిన యోగుల నుంచి .. శ్రద్ధతో మరి అంకితభావంతో వారియొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి” అని తెలియజేశారు.

“ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఒకానొక జీవిత లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం దిశగా పని చేసినప్పుడే ఆత్మకు ఆనందం కలుగుతుంది! నేను చదువుకుని ఉద్యోగం చేస్తూ ధ్యానం గురించి తెలుసుకుని .. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం నేర్పించడమే నా లక్ష్యం అని తెలుసుకున్నాను. ఇక అప్పటినుంచి ఉద్యోగం మానివేసి .. ఆ లక్ష్యం దిశగానే అడుగులు వేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది స్నేహితులను సంపాదించుకున్నాను. వేలకు వేలు పిరమిడ్‌లను నిర్మింప జేయిస్తూ .. భూమిని స్వస్థత పరుస్తున్నాను. ఈ ప్రపంచంలో చిట్టచివరి మనిషి శాకాహారి అయ్యేంతవరకూ మరి చిట్టచివరి జంతువు పక్షి, చేప హాయిగా జీవించేంతవరకూ నేను నా లక్ష్యం దిశగానే పయనిస్తూంటాను” అని శాకాహార విశిష్టతను తెలియజేశారు. అనాటి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా “చక్కటి ఆలోచనా రహిత స్థితినీ మరి గొప్ప ఆనందానుభూతినీ పొందాం”.